telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

బీరకాయతొక్కు పచ్చడి

కావలసిన వస్తువులు:

బీరకాయలనుండి తరిగేసిన చెక్కులు - అరకేజీ.
ఆయిల్ - 25గ్రా||.
చింతపండు. - రెండు రెప్పలు.
ఉప్పు - సరిపడినంత.
ఎండుమిర్చీ - 6.
ఇంగువ ముక్క - చిన్నది.

తయారు చేసే విధానం:

ముందుగా ఎండుమిర్చీ ఇంగువ ముక్క వేయించి పెట్టుకోవాలి. బీరపొట్టు శుభ్రంగా కడిగెయ్యాలి. ఆయిలు మరిగించి బీరపొట్టును అందులో వేసి దాని మధ్యలో చింత పండును ఉంచి కొంచెం నీళ్ళుచల్లి మూతపెట్టాలి. నీళ్ళన్నీ ఇగిరిపోయి చెక్కు బాగ మెత్తబడిన తరువాత ఆ చెక్కు చింతపండు మిశ్రమాన్ని వేయించిపెట్టిన ఎండుమిర్చీ ఏకంచేసి సరిపడా ఉప్పు వేసి రోట్లోవేసి దంచేయాలి.


[ వెనుకకు ]

మామిడికాయ పచ్చడి

కావలసిన వస్తువులు:

మామిడికాయలు - 4 మామిడికాయలు
ఆయిల్ - 100గ్రా||.
ఎండుమిర్చీ - 150గ్రా||.
మెంతులు - 1 చెం|| మెంతులు.
ఆవాలు - 2 చెం|| ఆవాలు.
ఉప్పు - సరిపడినంత.
పసుపు - చిటికెడు.

తయారు చేసే విధానం:

మామిడికాయల తొక్కలుచెక్కి టెంకెకి ముక్క అంటుకుపోకుండా పెద్దపెద్ద ముక్కలుగా తరిగి ఉప్పూ, పసుపూ వేసి కచ్చామచ్చాగా దంచి వుంచాలి. ఆయిలుకాచి, ఆవాలు మెంతులూ ఎండుమిర్చి వేయించి వాటిని కూడ మెత్తగాదంచి అదీ, మామిడి ముక్కల తొక్కు కలిపి మెత్తగా పచ్చడి నూరుకోవాలి.


[ వెనుకకు ]

వంకాయ పచ్చడి

కావలసిన వస్తువులు:

పచ్చడి వంకాయ - 1.
నూనె - 25గ్రా||.
చింతపండు - ఉసిరికాయంత.
ఎండుమిర్చి - 10.
ఉప్పు - సరిపడినంత.

అభిరుచినిబట్టి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు.


తయారు చేసే విధానం:

వంకాయకాను ముక్కలుగా తరిమి నూనెలో వేయించాలి. అలాగే ఎండుమిర్చిని కూడ వేయించాలి. ముందుగా ఎండుమిర్చి, చింతపండుని రోట్లో వేసి మెత్తగ అయ్యేంతవరకు దంచాలి. తరువాత వంకాయ, జీలకర్ర శరగపప్పు, మునపప్పు, ఆవాలు వేసి దంచాలి. ఇప్పుడు వంకాయపచ్చడి రెడీ.


[ వెనుకకు ]

బీరకాయ పచ్చడి

కావలసిన వస్తువులు:

బీరకాయలు - పావుకిలో.
పచ్చిమిర్చి - 100 గ్రా||.
చింతపండు - నిమ్మకాయంత.
నూనె - 25గ్రా||.
ఉప్పు - తగినంత.
జీలకర్ర - పావు చెంచా.
వెల్లుల్లిరేకలు - 4.

తయారు చేసే విధానం:

బీరకాయలపై పెచ్చులు తీసేసి కడిగి ముక్కలు చేయాలి. పచ్చిమిర్చి ముక్కలుచేసి వేయించి తియ్యాలి. అనంతరం బీరముక్కలుకూడ వేరే వేయించి తీసుకోవాలి. మిర్చి, చింతపండు, ఉప్పు కలిపి రోట్లో బాగా నూరి అందులో బీరముక్కల్ని కూడా పడేసి పచ్చడిపచ్చడిగ నూరెయ్యడమే. చివర్లో జీలకర్ర, వెల్లుల్లిరేకలు కూడా వేసి నూరితే అదో సువాసనగా ఉంటుంది.


[ వెనుకకు ]

టమోటా చారు

కావలసిన వస్తువులు:

టమోటాలు - 6.
నీళ్ళు - 3 గ్లాసులు.
చింతపండు - నిమ్మకాయంత.
పసుపు - చిటికెడు.
కొత్తిమీర - కొంచెం.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

టమోటోల్ని శుభ్రంగా కడిగి, 3 గ్లాసుల నీళ్ళలో పడేసి ఉప్పు, చింతపండు కుడా వేసి మొత్తం బాగా పిసికి కొంచెం పసుపు చల్లి స్టౌకెక్కించి కాచుకోవాలి. అవికొంచెం మరిగిన తరువాత దింపి కొత్తిమీర చల్లి తిరగమోత పెట్టుకోవాలి. వేడి వేడి టమోటా రసం రెడీ.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: