telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

ఆలూ క్యారట్ డిలైట్

కావలసిన వస్తువులు:

ఆలుగడ్డ కూర - ఒక కప్పు.
క్యారట్ - ఒకటి.
పన్నీర్ - కొంచెం.
కొత్తీమీర తరుగు - కొంచెం.
బ్రెడ్ పొడి - ఒక కప్పు.
పచ్చిమిర్చి తరుగు - తగినంత.
గరం మసాల - ఒక చెంచా.
అల్లం వెల్లుల్లి ముద్ద - అర చెంచా.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

ముందుగా క్యారెట్‌ను ఉడికించి అందులో పనీర్ వేసి బాగా కలపాలి. దీనికి ఆలుగడ్డ కూర చేర్చాలి. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు ఇతర దినుసులు వేసి చపాతీ పిండిలా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనెపోసి వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసి అరచేతితోనే కాస్త మందంగా బిస్కట్ల మాదిరిగా చేసుకోవాలి. వీటిని బ్రెడ్ పొడిలో అటుఇటూ తిప్పి నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీయాలి. వీటిని సాస్ లేదా చట్నీతో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.


[ వెనుకకు ]

ఆలూ పాపడ్

కావలసిన వస్తువులు:

బంగాళదుంప కూర - చిన్న కప్పు.
అప్పడాలు - నాలుగైదు.
జీలకర్ర పొడి - ఒక చెంచా.
ఉప్పు - తగినంత.
కారం - ఒక చెంచా.
ఆంచూర్ - ఒక చెంచా.
నూనె - వేయించటానికి సరిపడా.
కొత్తిమీర తరుగు. - ఒక చిన్న కప్పు.
టమాటాసాస్. - తగినంత.

తయారు చేసే విధానం:

బంగాళదుంప కూరను బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆంచూర్, జీలకర్ర పొడి కలపాలి. ఇప్పుడు అప్పడాలను తీసుకొని మద్యలో బంగాళదుంప కూర పెట్టి, నాలుగువైపులా మడిచి చేతికి తడి చేసుకొని అతికించాలి. ఈ లోగా బాణీలో నూనెపోసి బాగా కాగాక, వీటిని వేసి వేయించి తీయాలి. చివరిగా కొత్తిమీరతో అలంకరిస్తే, ఆలూ పాపడ్ రెడీ, వీటిని వేడివేడిగా సాస్ తో తినాలి.


[ వెనుకకు ]

అన్నంతో టిక్కీలు

కావలసిన వస్తువులు:

అన్నం - మూడు కప్పులు.
పాలకూర - ఒక కట్ట.
పొదీన - ఒక కట్ట.
జీలకర్ర - చిన్నచెంచా.
గరం మసాలాపొడి - ఒక చెంచా.
కారం, ఉప్పు - తగినంత.
నూనె - వేయించటానికి సరిపడా.
శెనగపిండి - రెండు స్పూన్లు.

తయారు చేసే విధానం:

ముందుగా అన్నాన్ని ఓ వెడల్పాటి బేసిన్‌ లోకి తీసుకోవాలి. పైన చెప్పిన పదార్ధాలన్నీ అన్నంలో వేసి ముద్దలా కలపాలి. ఇప్పుడీ ముద్దను చిన్నచిన్న ఉండల్లా చేసుకొని మీకు నచ్చిన ఆకృతిలో చేసుకోండి. వీటన్నిటిని ఓ ప్లేటులో సర్దుకోవాలి. ఇప్పుడు బాణీలో నూనెవేసి బాగా కాగిన తర్వాత సిద్దంగా ఉంచుకున్న టిక్కీలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. టమాటసాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వేడివేడి టిక్కీలను పిల్లలు ఇట్టే లాగించేస్తారు. ఇందులో ఆకుకూరలతో పాటు... కావాలనుకుంటే పచ్చిబఠాణీ కూడా చేర్చవచ్చు. బాగా ముద్దగా రావాలనుకుంటే మాత్రం కాసిని గోరువెచ్చని నీరు పోయాలి.


[ వెనుకకు ]

చపాతీ చాట్

కావలసిన వస్తువులు:

చపాతీలు - మూడు.
నూనె - వేయించటానికి సరిపడా.
మీఠా చట్నీ - అరకప్పు.
పెరుగు - పెద్దకప్పు.
కారం - అర చెంచా.
జీలకర్ర పొడి - ఒక చెంచా.
ఉప్పు - తగినంత.
నల్ల ఉప్పు - కొద్దిగా.
కొత్తిమీర తరుగు - చిన్నకప్పు.

మీఠాచట్నీ తయారు చేయటం:

కొద్దిగా చింతపండును ఉడికించి చిక్కటి గుజ్జు తీయాలి. దీనికి తగినంత బెల్లంపొడి, జీలకర్ర పొడి, ఉప్పు , కారం చేర్చాలి. మరో రెండు ఉడుకులు రానిచ్చి స్టౌపై నుంచి దింపేయాలి. అంతే మీఠాచట్నీ రెడీ.

తయారు చేసే విధానం:

చపాతీలను నాలుగు ముక్కలుగా చేసి నూనెలో దోరగా వేయించాలి. వీటిని మళ్ళీ చిన్నచిన్న ముక్కలుగా చేసుకొవాలి. వీటిని ఓ ప్లేటులో సర్ది, పైన పెరుగు పోయాలి. ఇప్పుడు తగినంత మీఠాచట్నీ వేయాలి. ఈ మిశ్రమంపై ఉప్పు, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కారం చల్లాలి. కొత్తీమీర తరుగుతో అలంకరిస్తే చపాతీ చాట్ సిద్దమైనట్లే. ఇష్టమున్నవారు సన్నని కారప్పూస కూడా వేసుకోవచ్చు, చేసిన వెంటనే తింటే... చపాతీ ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి.


[ వెనుకకు ]

ఫ్రూట్ సమొసా

కావలసిన వస్తువులు:

మైదాపిండి - ఒక కప్పు.
నెయ్యి (పూర్ణానికి) - ఒక టేబుల్ స్పూన్‌.
అరటిపండు, ఖర్జూరాలు - ఒక కప్పు.
జాజికాయ పొడి - 1/4 టీ స్పూన్‌.
నారింజ లేదా నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్‌.

తయారు చేసే విధానం:

పూర్ణానికి ఇచ్చిన వస్తువులన్నింటిని కలిపి పెట్టుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మద్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. యమరుచిగా వుండే ఈ సమోసాలను మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తాయి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: