telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

చిల్లీ పనీర్‌

కావలసిన వస్తువులు:

‌పనీర్‌ - 100గ్రా.
పచ్చిమిర్చి - నాలుగు.
‌సన్నగా తరిగిన వెల్లుల్లి - ‌ఒక టేబుల్‌ స్పూను
మైదా - రెండు టేబుల్‌ స్పూన్లు.
కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌ స్పూను
ఉప్పు - అర టీ స్పూను.
‌అజనొమోటో - అర టీ స్పూను.
‌కోడి గుడ్డు - ఒకటి.
‌చిల్లీ సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను.
‌నూనె - వేయించడానికి తగినంత.

తయారు చేసే విధానం:

పనీర్‌ను డైమండ్‌ ఆకారంలో ముక్కలు చేసుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, కోడిగుడ్డు సొన వేసి కలపాలి. వీటి మిశ్రమం పనీర్‌ ముక్కలకు కోటింగ్‌గా పట్టేస్తుంది. ఇలా కలిపిన వెంటనే నూనె వేడిచేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి. కోడిగుడ్డు ఇష్టపడని వాళ్లు దానికి బదులుగా కోటింగ్‌ మిశ్రమంలో తగినన్ని నీటిని కలుపుకోవచ్చు. బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి వేడిచేసి సన్నగా తరిగిన మిర్చి, వెల్లుల్లి వేసి వేగిన తరువాత రెండు టీ స్పూన్ల నీళ్లు, ఉప్పు, అజనొమోటో, చిల్లీ సాస్‌ వేసి అన్నింటినీ కలపాలి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన ఉంచిన పనీర్‌ ముక్కలను వేసి కలిపి దించేయాలి. చివరిగా ఉల్లిపాయ, కొత్తిమీరలతో గార్నిష్‌ చేయాలి. పేరుకు చిల్లీ పనీర్‌ అయినా ఎక్కువ ఘాటు ఉండదు. పిల్లలు ఇష్టపడే ఫ్లేవర్‌ కాబట్టి నిరభ్యంతరంగా ఈవెనింగ్‌ స్నాక్‌ కోసం ప్లాన్‌ చేసుకోవచ్చు.


మూలం : 24-01-09, శనివారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

పనీర్‌ కాజు ముఠ్ఠీఫ్రై

కావలసిన వస్తువులు:

‌పనీర్‌ - 50గ్రా.
‌జీడిపప్పు - 50గ్రా.
‌మైదా - ‌ఒక టేబుల్‌ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర టీ స్పూను.
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత.

తయారు చేసే విధానం:

ముందుగా పనీర్‌ను మెత్తగా చిదమాలి (అవసరమనిపిస్తే తురుముకోవచ్చు). అందులో మైదా, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఒక్కొక్క బాల్‌ని చేతిలోకి తీసుకుని అరచేతిలో పెట్టి రౌండ్‌గా కాని మనకు కావలసిన షేప్‌లో కాని వేళ్లతో ఒత్తి దాని మీద జీడిపప్పును (ఫొటోలో ఉన్న విధంగా) అద్దాలి. దీనిని నూనెలో వేసి దోరగా వేయించి తీయాలి. ఇలా అన్నింటిని వేయించి తీసుకున్న తర్వాత వాటిని ప్లేటులో పేర్చి చెర్రీని అందంగా కట్‌ చేసి గార్నిష్‌ చేయాలి. వీటిని చూస్తేనే నోరూరుతుంది. పది నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలు ఇట్టే అట్రాక్ట్‌ అవుతారు.


మూలం : 24-01-09, శనివారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

పనీర్‌ మెజిస్టిక్‌

కావలసిన వస్తువులు:

‌పనీర్‌ - 100గ్రా.
మైదా - రెండు టేబుల్‌ స్పూన్లు.
‌కార్న్‌ఫ్లోర్‌ (మొక్కజొన్న పిండి) - ‌రెండు టేబుల్‌ స్పూన్లు.
‌కోడిగుడ్డు - ఒకటి.
అజనొమోటో - అర టీ స్పూను.
మిరియాలపొడి - అర టీ స్పూను.
ఉప్పు - అర టీ స్పూను లేదా రుచికి తగినంత.
తరిగిన పచ్చిమిర్చి - ఒక టేబుల్‌ స్పూను.
తరిగిన వెల్లుల్లి - ఒక టీ స్పూను.
పుదీనా పేస్ట్‌ - ఒక టీ స్పూను.
ఎండు మిర్చి - రెండు.
కారం - చిటికెడు.
ఫుడ్‌ కలర్‌ (ఎల్లో) - చిటికెడు.
నిమ్మకాయ - సగం.
నూనె - వేయించడానికి తగినంత.

తయారు చేసే విధానం:

పనీర్‌ను పొడవుగా (స్టిక్‌లాగా) కట్‌ చేయాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, అజనొమోటో, మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, ఫుడ్‌ కలర్‌ అన్నింటినీ వేసి ఇవన్నీ పనీర్‌ స్టిక్స్‌కు సమంగా పట్టేటట్లు చేయాలి. కోటింగ్‌ సరిపోలేదనుకుంటే మరొక కోడిగుడ్డు సొనను కూడా వేసుకోవచ్చు. స్టిక్స్‌కు అన్ని వైపులా మిశ్రమం కవర్‌ అయ్యేటట్లు ఉండాలి. ఈ స్టిక్స్‌ను నూనెలో దోరగా వేయించి పక్కనుంచాలి.

ఇప్పుడు తాలింపు కోసం బాణలి పెట్టి అందులో ఒక టేబుల్‌ స్పూను నెయ్యి లేదా వెన్న వేసి వేడయిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పుదీనా పేస్ట్‌ వేయాలి. అవి వేగిన తరువాత నిమ్మరసం, కారం, అజనొమోటో వేసి తాలింపు సమంగా కలిపి, ముందుగా వేయించి సిద్ధంగా ఉంచిన పనీర్‌ స్టిక్స్‌ను వేసి మసాలా అన్నింటికీ సమంగా పట్టేటట్లు చేయాలి. దీనిని ప్లేట్‌లోకి తీసి క్యారెట్‌, పుదీన, ఉల్లిపాయ, టొమాటోలతో అందంగా అలంకరించారంటే... పదిహేను నిమిషాలలో ప్రిపేర్‌ చేసిన పనీర్‌ మెజిస్టిక్స్‌ రెండు నిమిషాల్లో నిజంగా మ్యాజిక్‌ స్టిక్స్‌లాగానే మాయమవుతాయి.


మూలం : 24-01-09, శనివారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

స్వీట్‌ కార్న్‌ సూప్

కావలసిన వస్తువులు:

‌మొక్కజొన్న గింజలు - 1 కప్పు (పచ్చివి).
క్యారెట్‌ - 1.
బీన్స్‌ - ‌గుప్పెడు.
కార్న్‌ఫ్లోర్‌ - పావు కప్పు.
ఉప్పు - తగినంత.
మిరియాలు - 4.
పంచదార - 1 టీ స్పూను.
కూరగాయలు లేదా పప్పు ఉడకబెట్టిన నీళ్ళు - 3 కప్పులు.

తయారు చేసే విధానం:

అడుగు మందంగా ఉన్న పాత్రలో కూరగాయలు లేదా పప్పు ఉడికించిన నీళ్ళుపోసి వేడిచేసి మొక్కజొన్న గింజలు, కూరగాయ ముక్కలు, పంచదార, ఉప్పు, మిరియాలు వేసి ఉడికించాలి. కూరగాయలు ఉడికిన తరువాత స్టౌపైనుంచి దించి నీటిని వడకట్టాలి. వడకట్టిన కూరగాయలను గ్రైండ్‌ చేసి ఉడికించిన నీటిని కూడా కలిపి తీసుకోవాలి. దీనిని క్రంచ్‌ స్నాక్స్‌తో తీసుకుంటే బాగుంటుంది.


మూలం : 06-12-08, శనివారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: