telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

షీర్‌ ఖుర్మా

కావలసిన వస్తువులు:

‌సేమ్యా - 2 కప్పులు.
‌పంచదార - 1 కప్పు.
‌నెయ్యి - ‌4 టీ స్పూన్స్.
బాదం - గుప్పెడు.
జీడిపప్పు - ‌గుప్పెడు.
పిస్తా - గుప్పెడు.
‌తర్భుజ గింజలు - 2 టీ స్పూన్స్.

తయారు చేసే విధానం:

సేమ్యా, బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి నేతిలోవేయించాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగనివ్వాలి. మరిగిన పాలకు పంచదార కలిపి మరో పదినిమిషాలు మరిగించాలి.

వేయించిన సేమ్యా, బాదం, పిస్తా, జీడిపప్పులు కలిపి రెండు నిమిషాలు ఉడికించి స్టౌ పైనుంచి దించేయాలి.


[ వెనుకకు ]

‌‌దమ్‌కే సేమ్యా‌

కావలసిన వస్తువులు:

‌‌సేమ్యా - 2 కప్పులు(పొడవుగా వుండేవి)
‌పంచదార - 1 కప్పు.
‌‌నెయ్యి - ‌4 టీ స్పూన్స్.
‌పాలు - 1 కప్పు.
‌బాదం - ‌గుప్పెడు.
పిస్తా - గుప్పెడు.
‌జీడిపప్పు - ‌గుప్పెడు.
ఏలుకల పొడి - పావు టీ స్పూన్‌.

తయారు చేసే విధానం:

బాదం, పిస్తా, జీడిపప్పు సన్నగా తరిగి నేతిలో వేయించి పక్కన ఉంచుకోవాలి. సేమ్యాని నేతిలోవేయించాలి. పంచదార, పాలు కలిపి పాకం పట్టి సేమ్యా చేర్చి కలుపుతూ వుండాలి. దీనిని సన్నని మంట మీద మగ్గనివ్వాలి.

సేమ్యా ఉడికి దగ్గరకు రాగా నే వేయించి వుంచిన బాదం, పిస్తా, జీడిపప్పులు, ఏలకులపొడి కలిపి మరో పది నిమిషాలు మగ్గనిచ్చి స్టౌపైనుంచి దించేయాలి.


[ వెనుకకు ]

‌డబుల్‌ కా మీఠా (స్లైస్‌)

కావలసిన వస్తువులు:

‌‌బ్రెడ్‌ ముక్కలు - 10.
‌పంచదార - 1 కప్పు.
‌‌పాలు - ‌1 కప్పు.
నెయ్యి - పావు కప్పు.
ఏలకులు - ‌4.
జీడిపప్పు - ‌10.
బాదం పప్పు - 10.
పిస్తా - 10.

తయారు చేసే విధానం:

ఒక్కొక్క బ్రేడ్‌ను నాలుగుముక్కలు చేసి నేతిలో వేయించుకోవాలి. పాలు మరిగించి పక్కనుంచాలి.

మరొక పాత్రలో పంచదార పాకం పట్టు కోవాలి.

బ్రెడ్ ముక్కలను పాకంలో వేసి మరిగించిన పాలుపోసి ముక్క చెదరకుండా పాలు, పాకం కలిసేలా చూడాలి.

బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నని ముక్కలుగా తరిగి నేతిలో వేయించి కలుపుకోవాలి.


[ వెనుకకు ]

‌‌పెరుగు ఆవడ

కావలసిన వస్తువులు:

‌‌శనగపిండి - 1 కప్పు.
‌పెరుగు - 2 కప్పులు.
‌‌అల్లం తరుగు - ‌‌అర టీ స్పూన్‌.
వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్‌.
‌పసుపు - పావు టీ స్పూన్‌.
‌‌వంట సోడా - ‌‌చిటికెడు.
ఎండు మిర్చి - 4.
‌ఉప్పు - తగినంత.
‌‌కొత్తిమీర తరుగు - ‌‌2 టీ స్పూన్స్.
నూనె - వేయించేందుకు తగినంత.
‌పోపు గింజలు - 1 టీ స్పూన్‌.

తయారు చేసే విధానం:

బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేడిచేసి పోపు గింజలు వేయించి పసుపు, తగినంత ఉప్పు ఎండు మిరపకాయలు వేయించి పక్కనుంచుకోవాలి.

తగినంత నీటిలో శనగపిండి, పసుపు పంట సోడా, అల్లం, ఉప్పు కలిపి ముద్దచేసి ఒక గంటపాటు పక్కన పెట్టాలి.

బాణనిలో నూనె వేడిచేసి శనగపిండి మిశ్రమంతో తగినంత సైజులో వడలు వేయాలి.

దోరగా వేయించిన వడలను నూనె వడకట్టి పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి.

వడలను పెరుగులో ఒక గంపాటు నానివ్వాలి. వడ్డించేముందు కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది.


[ వెనుకకు ]

‌‌వంకాయ బఠాణీ కూర

కావలసిన వస్తువులు:

‌‌వంకాయలు - అరకిలో.
‌పచ్చిబఠాణీ - 1 కప్పు.
‌‌పసుపు - ‌పావు టీ స్పూన్‌.
ఉప్పు - తగినంత.
ఆవాలు, జీలకర్ర - 1 టీ స్పూన్‌.
అల్లం తరుగు - అర టీ స్పూన్‌.
‌వెల్లుల్లి రేకులు - 6.
‌‌ఎండుమిర్చి - ‌3.
కరివేపాకు రెబ్బలు - 3.
ఉల్లిపాయలు - 2.
పచ్చిమిర్చి - 3 (మెదుపుకోవాలి).
‌నూనె - 1 టేబుల్‌ స్పూన్‌.
‌‌కొత్తిమీర - ‌గార్నిష్‌కి సరిపడా.

తయారు చేసే విధానం:

ముందుగా ఒక కప్పు నీటిలో ఉప్పు వేసి, పసుపు, వంకాయలు, బఠాణీ వేసి ఉడికించాక నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.

పాత్రలో నూనె వేడయ్యాక, జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి అరనిమిషాం పాటు వేయించుకోవాలి.

ఉడకబెట్టుకున్న వంకాయలు, బఠాణీ, ఉప్పు వేసి కలియ బెట్టి అయిదు నిమిషాలపాటు వేయించుకున్నాక మూతపెట్టి 15 నిమిషాల తరువాత దించేయాలి.

కొత్తిమీరతో గార్నీష్ చేసి వేడిగా చపాతిల్లోకు గాని అన్నంలోకి గాని వడ్డిస్తే టేస్టీగా ఉంటుంది.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: