telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

గోరుచిక్కుడు టొమాటో కర్రి

కావలసిన వస్తువులు:

‌గోరుచిక్కుడు - పావుకిలో.
‌టొమాటో - 1 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి).
‌ఉల్లిపాయ - ‌1 (తరగాలి).
పచ్చిమిర్చి - 4.
జీలకర్ర, ఆవాలు - ‌1 టీస్పూన్‌.
కొత్తిమీర - 1 టీస్పూన్‌.
‌కరివేపాకు - 2.
‌నువ్వులపొడి - 1 టీస్పూన్‌.
‌నూనె - ‌1 టీస్పూన్‌.
ఎండుమిర్చి - 2.
ఉప్పు - ‌తగినంత.
పసుపు - పావు టీస్పూన్‌.

తయారు చేసే విధానం:

ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీరని కలిపి గ్రైండ్ చేసుకోని పక్కన పెట్టుకోవాలి.

పాత్రలో నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, ఒకదాని తర్వాత ఒకటి వేసి, ఎండుమిర్చి, కరివేపాకుని జత చేయాలి.

ఉల్లిపాయలు, పసుపు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి టొమాటో ముక్కల్లి వేసి అయిదు నిమిషాలు వేయించాలి.

గోరుచిక్కుడు, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉంచి అందులో పచ్చిమిచ్చి ముద్దని వేసి కలియబెట్టి రెండు నిమిషాలు వేయించుకోవాలి.

నువ్వులపొడి వేసి మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉంచాలి. అడుగు మడకుండా మధ్య మధ్యలో కలుపుతూ గోరుచిక్కుడు ఉడుకేంతవరకు ఉంచి మంట తీసేయాలి.

వేడివేడిగా అన్నంలోకి టేస్టీగా ఉంటుంది.


[ వెనుకకు ]

‌‌చేమ దుంపల పులుసు

కావలసిన వస్తువులు:

‌‌చేమ దుంపలు - పావుకిలో.
‌చింతపండు - కొద్దిగా (1 కప్పు నీటిలో నానబెట్టుకోవాలి).
‌‌టొమాటో - ‌1 (సన్నగా తరగలి).
‌ఆవాలు, జీలకర్ర - 1 టీస్పూన్‌.
‌ఎండుమిర్చి - ‌2 (మధ్యలోకి విరిచి గింజలు తీసేయాలి).
నువ్వుల పొడి, ధనియాల పొడి - 1 టీస్పూన్‌.
జీలకర్ర, మెంతిపొడి - అర టీస్పూన్‌.
బెల్లం తురుము - 1 టీస్పూన్‌.
ఉల్లిపాయ - 1 (తరగాలి).
కరివేపాకు - 2 రెమ్మలు.
కారం - 1 టీస్పూన్‌.
పసుపు - చిటికెడు.
ఉప్పు - తగినంత.
నూనె - 1 టేబుల్‌ స్పూన్‌.
కొత్తిమీర - గార్నష్‌కి సరిపడా.

తయారు చేసే విధానం:

ముందుగా చేమదుంపలను ఉడకబేట్టి చల్లారాక చెక్కు తీసేయాలి.

పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

ఉల్లిపాయ బ్రౌన్‌ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

టొమాటో, పసుపు, ఎందుమిచ్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి జత చేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.

చేమదుంపను వేసి ఐదు నిమిషాలు వేయించుకోవాలి.

నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కారం,ఉప్పు జత చేసి, ధనియాలపొడి, నువ్వులపొడి, జీలకర్ర, మెంతిపొడి, బెల్లం తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసి కలియబెట్టి పది నిమిషాలు ఉంచాలి.

ఈ మిశ్రమం చిక్కబడ్డాక దింపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.


[ వెనుకకు ]

పప్పు - బీట్‌రూట్‌ ఫ్రై

కావలసిన వస్తువులు:

‌‌బీట్‌రూట్‌ - 2 మీడియం సైజ్‌వి (చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి).
‌కందిపప్పు - 1 కప్పు (ఉడకబెట్టాలి).
‌‌పచ్చిమిచ్చి - ‌3 నిలువుగా కట్‌ చేసుకోవాలి).
ఎండుమిర్చి - 3 (మధ్యలొకి విరిచి గింజలు తీసేయాలి).
పసుపు - ‌చిటికెడు.
కరివేపాకు - ‌2 రెబ్బలు.
ఆవాలు - అర టీ స్పూన్‌.
మినప్పప్పు - అర టీస్పూన్‌.
నూనె - 2 టీ స్పూన్స్.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

ముందుగా కందిపప్పును ఉడకబెట్టుకోవాలి

పాత్రలో నూనె వేడయ్యాక, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి.

పచ్చిమిర్చి, బీట్‌రూట్‌, పసుపు, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి కలిపి, మూత పెట్టి సన్నని మంటపై 15 నిమిషాలుంచాలి.

బీట్‌రూట్‌ కొద్దిగా మెత్త బడగానే కందిపప్పుని జత చేసి కలిపి మరో 5 నిమిషాలుంచి దించేయాలి

వేడివేడిగా అన్నంలోకి వడ్డించాలి.


[ వెనుకకు ]

‌‌క్యాప్సికమ్‌ పచ్చడి

కావలసిన వస్తువులు:

‌‌క్యాప్సికమ్‌ - 3 (తరగాలి).
‌పచ్చిమిర్చి - 5 (తరగాలి).
‌‌చింతపండు గుజ్జు - ‌‌2 టేబుల్ స్పూన్స్.
ఉల్లిపాయ - 1 (తరగాలి).
‌జీలకర్ర, ఆవాలు - 1 టీ స్పూన్‌.
‌‌ఎండుమిర్చి - ‌‌2.
మినప్పప్పు - అర టీస్పూన్‌.
‌శనగపప్పు - అర టీస్పూన్‌.
‌‌ఇంగువ - ‌‌చిటికెడు.
కరివేపాకు - 2.
‌నూనె - 1 టేబుల్‌ స్పూన్‌
‌‌ఉప్పు - ‌‌తగినంత.

తయారు చేసే విధానం:

పాత్రలో కొద్దిగా నూనె వేసి పచిమిర్చి వేసి అయిదు నిమిషాలపాటు వేయించుకుని, దింపేసి చల్లార్చుకోవాలి.

అదే పాన్‌లో క్యాప్సికమ్‌ని అయిదు నిమిషాలు పాటు వేయించుకోని దింపేసి చల్లార్చుకోవాలి.

చల్లార్చిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో పాటు చింతపండు గుజ్జుని జత చేసి గ్రైండ్ చేసుకోవాలి

మిగతా నూనెని పాత్రలో వేసి జీలకర్ర, ఆవాలతో చిటపటలాడించాక పప్పు వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి.

ఉల్లిపాయల్ని జత చేసి అయిదు నిమిషాలు వేయించుకోవాలి గ్రైండ్‌ చేసుకున్న పేస్ట్‌ని జత చేసి కలియబేట్టి 15 నిమిషాలు ఉంచాలి.

ఉప్పు వేసి కలియబెట్టి, దింపేయాలి. క్యాప్సికమ్‌ పచ్చడి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కొన్ని రోజులపాటు నిల్వ ఉంటుంది.


[ వెనుకకు ]

‌‌ముల్లంగి పెరుగు పచ్చడి

కావలసిన వస్తువులు:

‌‌ముల్లంగి - 1 (సన్నగా తురుముకోవాలి).
‌ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిపేట్టుకోవాలి).
‌‌పెరుగు - ‌2 కప్పులు.
పచ్చిమిర్చి - 4.
కరివేపాకు - 2.
జీలకర్ర, ఆవాలు - 1 టీస్పూన్‌.
‌‌మినప్పప్పు - ‌అర టీస్పూన్‌.
పసుపు - చిటికెడు.
నూనె - 3 టీ స్పూన్స్.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

పాత్రలో నూనె వేడయ్యాక, జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక, మినప్పప్పుని వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

కరివేపాకు, ఉల్లిపాయ వేసి మూడునిమిషాలు వేయించుకోవాలి.

తురుమిపెట్టుకున్న ముల్లంగి, పసుపు, కొత్తిమీర వేసి పది నిమిషాలపాటు చిన్న మంటపై ఉంచి వేగాక, దింపేసుకోవాలి.

చల్లారిన మిశ్రమంలో పెరుగు వేసి కలియబెట్టాలి.

అన్నంలోకి గాని, చపాతిల్లోకిగాని వడ్డిస్తే టేస్టీగా ఉంటుంది.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: