|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
|
బాస్మతి బియ్యం |
- |
1 కప్పు (నానబెట్టాలి). |
|
యాలుకలు |
- |
3 లేదా 4 (పొడి చెయ్యాలి). |
|
బిర్యాని ఆకు |
- |
1. |
|
లవంగాలు |
- |
2. |
|
నూనె |
- |
1 చెంచా. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
నిమ్మకాయ |
- |
1/2 కాయ. |
|
నీరు |
- |
5-6 కప్పులు. |
|
వెజిటబుల్ లేయర్ |
|
|
|
ఫ్రెంచ్ బీన్స్ |
- |
4 చిన్న ముక్కలు చేసి |
|
క్యారెట్ |
- |
2 (చిన్న ముక్కలు చేసి) |
|
ఉడికించిన బఠానీలు |
- |
1/2 కప్పు. |
|
నూనె |
- |
3 చెంచాలు. |
|
పెరుగు |
- |
4 చెంచాలు. |
|
గరం మసాలా |
- |
1/2 చెంచా. |
|
అల్లం ముద్ద |
- |
1/2 చెంచా |
|
ఎర్ర కారం పొడి |
- |
1/2 చెంచా |
|
ఉప్పు |
- |
3/4 చెంచా |
|
ఖొయా |
- |
50గ్రాములు లేదా 1/2 కప్పు |
|
బాదం పప్పులు |
- |
10 (నిలువుగ చీల్చి) |
|
మరికొన్ని కావలసినవి |
|
|
|
ఉల్లిపాయలు |
- |
2 (చక్కగా తరిగి బంగారు రంగులో వేయించినవి) |
|
పాలు |
- |
1చెంచా |
|
కేసరి |
- |
చిటికెడు |
|
జీడిపప్పు |
- |
8 (దోరగా వేయించి) |
తయారు చేసే విధానం :
కేసరి 2 చెంచాలు నీటిలో 10-15 నిమిషాలు నానాలి. బియ్యాన్ని చక్కగా కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. 5-6 కప్పుల నీరు (దాదాపు) పెద్ద గిన్నెలో వేడి చెయ్యాలి. ఏలకులు, బిర్యాని ఆకు, లవంగాలు, ఉప్పు, నూనె & నిమ్మరసం కూడ నీటితో పాటుగా వేడి చెయ్యాలి. బియ్యాన్ని చిల్లుల బుట్టలో ఉంచి నీరు తీసేయాలి. తరువాత ఉడుకుతున్న నీటిలో వేయాలి. (బియ్యము 3 వంతులు పైగా ఉడకాలి కాని పూర్తిగా ఉడకకూడదు). దీన్ని పక్కకు వుంచాలి. ఇప్పుడు నూనె వేడి చేసి క్యారెట్, బీన్స్ ముక్కలు మెత్తగా అయ్యేలా చూడాలి. బఠాని (పీస్) కలపాలి. ఉప్పు, ఎర్రకారం, మసాలా కూడ కలపాలి.
అల్లం ముద్దని పెరుగుతో కలిపి దాన్ని కూర ముక్కల్తో కలపాలి. కలియబెడుతూ ఉండాలి (దాదాపు 3-4 నిమిషాలు). పెరుగు దగ్గర పడి నూనె వేరే విడిపొయ్యాక స్టవ్ నించి తీసివేయాలి. నెమ్మదిగా పాలకోవ (ఖోయా), బాదంపప్పులు కలిపి పక్కన ఉంచాలి(ఇష్టమైతేనే). ఇప్పుడు కొంచెం మందపాటి గిన్నెలో వెన్న లేదా నూనె పోసి, సగం అన్నం ఒక పొరగా పరచాలి. ముందుగా రెడీ చేసిన కేసరి నీటిని అన్నం పైన అక్కడక్కడ చల్లాలి. సగం వేయించిన కూరముక్కల్ని అన్నం పైన ఒక పొరలాగ పరచాలి. దీని పైన వేయించిన ఉల్లి ముక్కల్ని పరచాలి.
మళ్ళీ ఒక పొర అన్నం + కేసరి + మిగిలిన సగం కూర ముక్కలు + ఉల్లిపాయ ముక్కలు చివరగా జీడి పప్పులు పరచాలి.
ఇప్పుడు మూత పెట్టి సన్నటి వేడి లొనే నెమ్మదిగా (10 - దాదాపు నిమిషాలు) అన్నం పూర్తిగా మెత్తబడేదాకా ఉడికించాలి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
బంగాళాదుంప |
- |
2. |
|
క్యారెట్ |
- |
2. |
|
ఉల్లిపాయ |
- |
1. |
|
టమోటా |
- |
1. |
|
పెరుగు |
- |
1 కప్పు. |
|
నూనె |
- |
14 టీ స్పూనులు. |
|
మసాలకి |
|
|
|
ధనియాలు |
- |
4 టీ స్పూనులు. |
|
గసగసాలు |
- |
1 టీస్పూను. |
|
కొబ్బరి |
- |
1/4 చిప్ప. |
|
పట్ట |
- |
చిన్న ముక్క. |
|
లవంగాలు |
- |
7. |
|
అల్లం పేస్ట్ |
- |
2 టీ స్పూనులు. |
|
వెల్లుల్లి పేస్ట్ |
- |
2 టీ స్పూనులు. |
తయారు చేసే విధానం :
మసాల గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. క్యారెట్, బంగాళాదుంప విడిగా ఉడకబెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, టమోటా వేయించాలి. ఇవి వేగాక మసాల, ఉప్పు, కారం, పసుపు, కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి[10 లేదా 15 నిముషాలు]. ఇది ఉడికాక బంగాళదుంప, క్యారెట్ వేసి 2 నిముషాలు ఉంచాలి. దించబోయే ముందు పెరుగు వేసి కలపాలి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
బ్రెడ్ |
- |
9 ముక్కలు. |
|
చక్కెర |
- |
ఒకటిన్నర కప్పులు. |
|
పాలు |
- |
2 కప్పులు. |
|
జీడిపప్పు |
- |
తగినన్ని. |
|
ద్రాక్ష |
- |
తగినన్ని. |
|
ఏలకులపొడి |
- |
ఒక స్పూను. |
తయారు చేసే విధానం:
చక్కరలో 1/2 కప్పు నీళ్ళు పోసి తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. వేరొక గిన్నెలో పాలు 1 కప్పు అయ్యే వరకు మరగ పెట్టాలి. బ్రెడ్ని పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా వేయించాలి. మరొక పెద్ద గిన్నెలో 9 బ్రెడ్ ముక్కలని మూడు లక్కన ప్రక్క ప్రక్కన పేర్చి వాటిపై పైన తయారు చేసిన చక్కెర పాకం మరియు పాలు ఓకేరకంగా పొయ్యాలి. పైన జీడిపప్పు, ద్రాక్ష, ఏలకుల పొడి చెయ్యాలి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
ఖర్జూరం |
- |
500 గ్రాములు. |
|
పిస్తా |
- |
400 గ్రాములు. |
|
నెయ్యి |
- |
1టేబుల్ స్పూన్. |
|
చక్కెర |
- |
2 టేబుల్ స్పూన్. |
తయారు చేసే విధానం :
తడి ఖర్జూరంలో గింజలు శుభ్రంగా తీసివేయాలి. కొంచెంగ నేతిలో వేయించి ప్యాన్ లో నుంచి తీసి, చపాతి రొట్టె లాగ వత్తాలి. పొట్టు తీసిన పిస్తా గింజల్ని నూనెలేకుండా వేయించాలి. ఇప్పుడు రొట్టెలుగ చేసిన ఖర్జూరం పైన ఈ గింజలు అన్ని, గట్టిగా వత్తాలి. అన్ని అలాగ చేసాక, దోశ లాగ చుట్టేయాలి. 1-2 అంగుళాల ముక్కల సైజు వుందేటట్టు కత్తితో కోయాలి. చక్కెర చల్లి, చల్లారాక డబ్బా లో దాచుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది. పిల్లలు బాగా ఇష్టపడతారు. పెద్దలకు మంచిది ముఖ్యంగా డైయాబెటీస్ వాళ్ళు చక్కెర లేకుండా స్వీట్ గా తినవచ్చు ప్రయత్నం చేయండి. మీరూ ఇష్టపడతారు.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
సగ్గుబియ్యం |
- |
ఒకకప్పు. |
|
బియ్యప్పిండి |
- |
అరకప్పు. |
|
చిక్కటి పుల్ల పెరుగు |
- |
ఒకకప్పు. |
|
నానబెట్టిన శెనగపప్పు |
- |
ఒకటేబుల్ స్పూన్. |
|
సన్నగా తరిగిన ఉల్లిపాయలు |
- |
పావు కప్పు. |
|
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు |
- |
2. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
నూనె |
- |
తగినంత. |
తయారు చేసే విధానం :
సగ్గుబియ్యం కడిగి నీరంత పూర్తిగా వార్చేయాలి. దీనికి ఉప్పు, చిలికిన పెరుగు కలపాలి. ఇట్లా పెరుగులో కలుపుకున్న సగ్గుబియ్యం కనీసం ఆరేడు గంటలపాటు నాననివ్వాలి. ఇప్పుడు నానబెట్టిన శెనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బియ్యంప్పిండి అవసరం అయితే ఇంకొంచెం పెరుగు కూడా కలపాలి. బాండీలోనూనె పోసి నూనె కాగనివ్వాలి. ఈ పిండితో బోండాలు వేసి ఎర్రగా వేయించాలి. సగ్గుబియ్యం బోండాలు ఎంతో రుచిగా ఉంటాయి మీ పిల్లలు తప్పకుండా ఈ బోండాలను ఇష్టపడతారు. సగ్గుబియ్యం బోండాలు చేసేటప్పుడు చిక్కటి పుల్ల పెరుగులో మాత్రమే సగ్గుబియ్యం నానబెట్టాలి. సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో నానబెడితే బోండాలు వేసినప్పుడు బోండాలు చిట్లుతాయి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in