|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
|
గోధుమపిండి |
- |
అరకిలో |
|
వెన్న |
- |
10 - 15 గ్రా|| |
|
పాలు |
- |
25 మిల్లీ |
|
నూనె |
- |
200 మిల్లీ |
|
పెరుగు |
- |
అరకప్పు |
|
అరటిపండు |
- |
1 |
|
ఉప్పు |
- |
తగినంత |
తయారు చేసే విధానం :
నూనె తప్ప మిగతా సరుకులన్నీ, తగినన్ని నీళ్ళుపోసి పిండిలా కలిపెయ్యాలి. బాగా బలంగా పిసికి పెట్టాలి. రేపు ఉదయం చపాతీలు చెయ్యాలంటే ఈ రాత్రే ముద్ద రెడీగా ఉండాలి. ఉదయం ఈ ముద్దని నిమ్మకాయంత వుండలుగా చేసుకొని అప్పడాల పీటమీద అప్పడాల కర్రతో కావలసిన షేపులో దళసరిగానో, పల్చగానో వత్తుకోవాలి. పెనం వేడిచేసి ఆయిల్ రాసి పొగలురాగానే చపాతీలు వెయ్యాలి. తిరగేసేటప్పుడు కూడా ఆయిల్వేస్తే తినేందుకు మహారుచిగా వుంటాయి. అసలు ఆయిలే వెయ్యకుండా చేసుకుంటే మరీ ఆరోగ్యం! ఈ చపాతీలని ఏ అనుపానంతోనైనా తినేయొచ్చును. కాని, బంగాళదుంప కుర్మానే ప్రత్యేకంగా చేసుకుంటారు.
కావలసిన వస్తువులు:
|
గోధుమపిండి |
- |
అరకిలో |
|
వెన్న |
- |
10 - 15 గ్రా|| |
|
పాలు |
- |
25 మిల్లీ |
|
నూనె |
- |
కిలో |
|
ఉప్పు |
- |
తగినంత |
తయారు చేసే విధానం :
పూరీలు కూడా చపాతీల మాదిరే చేసుకోవాలి. చపాతీల పిండికన్నా పూరీపిండి యొక్కువసేపు నానాలి. పూరీలు వత్తుకున్నాక మూకుట్లో నిండుగా - వంటకం మునిగేలా నూనె పోసి మరిగించి, పూరీల్ని వేయించి తీసుకోవాలి.
కావలసిన వస్తువులు:
|
కందిపప్పు |
- |
100గ్రా|| |
|
చింతపండు |
- |
నిమ్మకాయంత |
|
ఎండుమిర్చి |
- |
2 |
|
పచ్చిమిర్చి |
- |
6 |
|
ఉల్లిపాయలు |
- |
250గ్రా|| |
|
కర్వేపాకు, కొత్తిమీర |
- |
కొంచెం |
|
ఉప్పు, కారం |
- |
తగినంత |
తయారు చేసే విధానం :
చింతపండునానేసుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలుగాను, పచ్చిమిర్చి సన్నంగాను తరుక్కోవాలి. ఎండుమిర్చి ముక్కలుగాను తుంపుకోవాలి. ముందుగా పప్పు ఉడకేసి బాగా ఎనిమి ఉల్లి, మిర్చిముక్కలు, కర్వేపాకులు, కొత్తిమీర, ఉప్పు, కారం, చింతపండు పులుసుపోసి కాసిని నీళ్ళు కూడపోసి మొత్తం 1 లీటరు ద్రవం చేసి మరిగించాలి. ఆ పులుసు పొంగుతున్నప్పుడు పోపులో ఇంగువ వేసుకుంటే పులుసు ఘుమఘుమ లాడి పోతుంది.
కావలసిన వస్తువులు:
|
క్యాబేజి |
- |
పావుకిలో |
|
శనగపిండి |
- |
పావుకిలో |
|
పచ్చిమిర్చి |
- |
15 |
|
కారం |
- |
అరచెంచా |
|
వరిపిండి |
- |
కొంచెం |
|
నూనె |
- |
100గ్రా|| |
|
ఉప్పు |
- |
తగినంత |
తయారు చేసే విధానం :
మిర్చీ, క్యాబేజీ సన్నగా తరిగి సరిపడా ఉప్పు, కారాలు వరిపిండితో సహా శంగపిండిలో పోసి తడితడిగా, పొడిపొడిగా వుండేలా కలపాలి. నూనెకాచి పిండిని పకోడీలుగా మెదిపి వేసి వేయించి తీసుకోవాలి. క్యాబేజి పకోడి రెడీ.
కావలసిన వస్తువులు:
|
సన్న బియ్యం |
- |
1 కేజీ |
|
చింతపండు |
- |
125 గ్రా|| |
|
ఎండుమిర్చి |
- |
50 గ్రా|| |
|
పచ్చిమిర్చి |
- |
50 గ్రా|| |
|
శనగపప్పు |
- |
50 గ్రా|| |
|
మినపప్పు |
- |
50 గ్రా|| |
|
ఆవాలు |
- |
25 గ్రా|| |
|
నూనె |
- |
125 గ్రా|| |
|
కర్వేపాకు |
- |
3 రెబ్బలు |
|
పసుపు |
- |
1 చిన్న చెంచా |
|
ఉప్పు |
- |
తగినంత |
తయారు చేసే విధానం :
చింతపండు నానబెట్టి తగినంత ఉప్పు వేసి చిక్కగా రసం చేసి వుంచుకోవాలి. అన్నం బిరుసుగా వార్చి విశాలమైన పళ్ళెంలో పోసి కాస్త ఆయిల్ పసుపు వేసి కలిపి వుంచాలి. నూనె కాచి శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోసి కాస్త వేగాక ఎండుమిర్చి వేసి వేయించిన యింగువ వేసి అసికూడా వేగాక పచ్చిమిర్చి చీలికలూ వేసి బాగా వేగాక ముప్పాతిక వంతు అన్నంలో వేసి తక్కిన పాతికవంతూ చింతపండు రసం కాసేపు వుడికించి అనంతరం అన్నంలో పోసి, గరిటెతో కలుపుకోవాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in