|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
|
ఖర్జూరం పళ్లు |
- |
12 |
|
జీడిపప్పు |
- |
2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి) |
|
బాదంపప్పు |
- |
2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి) |
|
పిస్తా ముక్కలు |
- |
2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి) |
|
యాలకుల పొడి |
- |
పావు టీ స్పూన్ |
|
పాలపొడి |
- |
రెండు టేబుల్ స్పూన్లు |
|
రోజ్ ఎసెన్స్ |
- |
కొన్ని చుక్కలు |
|
కొబ్బరి పొడి |
- |
రెండు టేబుల్ స్పూన్లు |
తయారు చేసే విధానం:
ఖర్జూరాలను మధ్యలో కొద్దిగా చీల్చి గింజలు తీసేయండి. అన్ని పప్పుల్ని, పాలపొడి, యాలకుల పొడి, రోజ్ ఎసెన్స్‌ని ఒక బౌల్లో కలుపుకుని ఖర్జూరాల్లో కొంచెం కొంచెం కూరి పెట్టండి. తర్వాత కొబ్బరి పొడిలో దొర్లించి తినండి.
కావలసిన వస్తువులు:
|
బెండకాయలు |
- |
200గ్రాములు |
|
పల్లీలు |
- |
30గ్రాములు |
|
జీలకర్ర |
- |
అర టీ స్పూను |
|
మినపప్పు |
- |
అర టీ స్పూను |
|
ఆవాలు |
- |
అర టీ స్పూను |
|
మిర్చి పొడి |
- |
ఒక టేబుల్ స్పూను |
|
పసుపు |
- |
అర టీ స్పూను |
|
ఉప్పు |
- |
సరిపడినంత |
|
నిమ్మరసం |
- |
1 టీ స్పూను |
|
పచ్చి కొబ్బరి తురుము |
- |
1టేబుల్ స్పూను |
|
రిఫైన్డ్ ఆయిల్ |
- |
సరిపడినంత |
తయారు చేసే విధానం:
బెండకాయ ముక్కలు, పల్లీలు విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేడిచేసి మినపప్పు, ఆవాలు, బెండీ, పల్లీలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, నిమ్మరసం, పచ్చికొబ్బరి తురుము ఒక్కొక్కటిగ వరుసగా వేసి పైన తురిమిన కొత్తిమీర చల్లి ఐదు నిమిషాలు సన్నని సెగపై వేయించాలి.
కావలసిన వస్తువులు:
|
బొంబాయి రవ్వ |
- |
250గ్రా. |
|
మైదాపిండి |
- |
100గ్రా. |
|
పాలు |
- |
500మి.లీ. |
|
బేకింగ్ పౌడర్ |
- |
1/2 టీ స్పూను |
|
ఉప్పు |
- |
1/2 టీ స్పూను |
|
చక్కెర |
- |
750గ్రా. |
|
కుంకుమపువ్వు |
- |
1/4గ్రా. |
|
జీడిపప్పు |
- |
50గ్రా. |
|
యాలకులు |
- |
1గ్రా. |
|
వెండి రేకులు |
- |
2 రేకులు |
|
నెయ్యి |
- |
100గ్రా. |
తయారు చేసే విధానం:
గిన్నెలో బొంబాయి రవ్వ, మైదాపిండిని తీసుకుని దానిలో ఉప్పు, పాలు కలిపి జారుడు పిండిలా తయారుచేసి మూతపెట్టి రెండు మూడు గంటలు ఎండలో ఉంచాలి. ఒక కడాయిలో కొంచెం నెయ్యివేసి పొయ్యిమీద పెట్టి కొంచెం పిండిని అట్టులా పోసి రెండువైపులా నేతిలో కాల్చాలి. ఈలోపు చక్కెరలో అరలీటరు నీళ్ళు పోసి లేతపాకం పట్టి దానిలో కుంకుమపువ్వు, యాలకుల పొడి, తరిగిన జీడిపొప్పు ముక్కలు కలిపి పక్కన ఉంచుకోవాలి. నేతిలో వేయించిన మాల్‌పూరీలను వెంటనే ముంచి 10 నిమిషాలు నానబెట్టాక తీసి పైన వెండి రేకులను పొరలా అద్ది పాకంతో పాటు వడ్డించాలి.
కావలసిన వస్తువులు:
|
ఖర్జూరం పళ్లు |
- |
200 గ్రాములు |
|
జీడిపప్పు |
- |
తగినంత |
|
బాదంపప్పు |
- |
తగినంత |
|
పిస్తా ముక్కలు |
- |
తగినంత |
|
యాలకులు |
- |
తగినంత |
|
కుంకుమపువ్వు |
- |
తగినంత |
|
అలంకరణకు వెండి కాగితం |
- |
తగినంత |
తయారు చేసే విధానం:
ఖర్జూరం పళ్ల విత్తనాలు తీసేసి, మెత్తగా ఉడికించాలి. డ్త్ర్ ఫ్రూట్స్, యాలకులు పొడి, కుంకుమపువ్వు కలిపి, ఒక పళ్లెంలో పోయాలి. వెండి కాయితంతో అలంకరించి చతురస్రపు ముక్కలు చేయాలి.
కావలసిన వస్తువులు:
|
సెనగపిండి |
- |
50 గ్రాములు |
|
మజ్జిగ |
- |
3 కప్పులు |
|
పసుపు |
- |
1 చిన్న చెంచా |
|
ఉప్పు |
- |
తగినంత |
|
నూనె |
- |
40 గ్రాములు |
|
కొత్తిమీర |
- |
1 పెద్ద చెంచా |
|
ఆవాలు |
- |
1 చిన్న చెంచా |
|
కొబ్బరి తురుము |
- |
కొద్దిగా |
తయారు చేసే విధానం:
ఒక పళ్లానికి నూనె రాసి పెట్టాలి. ఒక పాత్రలో పిండి, మజ్జిగ, ఉప్పు, పసుపు కలిపి మిశ్రమం తయారు చేయాలి. దాన్ని పొయ్యి మీద పెట్టి కలపకుండా, పాత్రను కదిలిస్తూ ముద్ద అయ్యేవరకూ ఉడికించాలి. తరువాత నూనె రాసిన పళ్లెంలో పోసి బాగా పలుచగా సర్దాలి. చల్లబడ్డాక, 2 అంగుళాల వెడల్పుతో ముక్కలు చేసి చుట్టగా చుట్టాలి. నూనె వేడి చేసి, ఆవాలు చిటపట లాడించి, ఆ పోపును ఈ చుట్టల మీద పోయాలి. వడ్డించే ముందు, పైనుంచి కొబ్బరి తురుము చల్లాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in