www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

డబ్బు

'ధనమేరా అన్నిటికి మూలం' అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అన్నిటికి కాక పోయిన మన జీవితం చాలా వరకు డబ్బు మీదే ఆధార పడి ఉన్నది. మనం డబ్బు చాలా సంపాదిస్తున్నాము. మనం ఎంత సంపాదించిన ఒక్క రూపాయి అయినా  వెనుకేసుకోవాలి అని పెద్దలు అంటారు. వెనుకేసుకోవటం అంటే వాటిని దాచిపెట్టుకోవటం అన్నమాట. కాని వాటిని పొదుపు చేసుకోవటం తెలియక అంతా వ్యర్ధం చేసుకుంటున్నారా ? డబ్బును మనం చాలా రూపాలలో దాచి పెట్టు కోవచ్చు అందులో ముఖ్యమైనవి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

బ్యాంక్

బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి రెండు విధానాలు ఉంటాయి

కరెంట్ అకౌంట్ ఇది ఎక్కువగా వ్యాపారస్తులు ఉపయోగిస్తుంటారు అంటే ఎప్పటికప్పుడు డబ్బువేస్తూ ఉంటారు అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు.

బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి సేవింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అది ఉంటే మనము ఆ బ్యాంకులో డబ్బు దాచి పెట్టుకోవచ్చు. ఈ అకౌంటు మనము మొదలు పెట్టాలి అంటే మనకు కావలసినవి

అలానే మనం కొంత డబ్బును డిపాజిట్ చేయాలి అంటే -

డిపాజిట్ అంటే మనము కొంత డబ్బును కొన్ని రోజులు లేక కొన్ని నెలల పాటు దాచి ఉంచాలి అని అనుకుంటే వాటిని బ్యాంకులో దాచుకోవటాన్ని డిపాజిట్ అంటారు. అక్కడ  మన డబ్బు సురక్షితంగా ఉంటుంది పైగా ఎక్కువ రోజులైతే వడ్డీ కూడా వస్తుంది. ఇలా దాచుకోవాలి అంటే మనకు ఆ బ్యాంకులో అకౌంట్ కచ్చితంగా ఉండాలి.

బ్యాంకుల వలన మనము డబ్బు దాచిపెట్టుకునే ఉపయోగాలే కాకుండా మనం బ్యాంకుల నుండి రుణాలను పొందే అవకాశం కూడా ఉంది. రుణం అంటే అప్పు అని అర్థం. మనకు తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చి వాయిదాల పద్దతిలో వారు ఇచ్చిన గడువు లోపల సకాలంలో తీర్చేలా మనకు సహకరిస్తున్నాయి. ఇందులో రెండు రకాల రుణాలు ఉంటాయి

కార్పోరేట్ రుణాలు

సంస్థలకిచ్చే రుణాలను వాటిని కార్పోరేట్ రుణాలు అంటారు.

రిటైల్ రుణాలు

వ్యక్తుల కిచ్చే వాటిని రిటైల్ రుణాలు అంటారు. అవి ప్రధానంగా ఐదు రకాలుంటాయి.

ఇల్లు కట్టు కోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, ఇల్లును అధునీకరించుకోవడానికి ఇచ్చేవి గృహ రుణాలు కాగా, ఉన్నత విద్యా భ్యాసం కోసం విద్యా రుణాలు, వాహనాలు కొనుగోలుకు వాహన రుణాలు, టి.వి., రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ తదితర గృహొపకరణాల  కొనుగోలుకు వినియోగ రుణాల్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్తుంటాయి. ఇటీవల బాగా ప్రాచుర్యం పొందినవి వ్యక్తిగత రుణాలు. మీరు ఏ ఇతర ఖర్చు కోసమైనా కారణం చెప్పకుండా, నేరుగా క్లీన్ లోన్‌గా తీసుకోవచ్చు. ఇవి కాకుండా బంగారం తనఖా చేయడం ద్వారా  గోల్డ్ లోన్, ఇతర ఆస్తుల్ని తనఖా చెయడం ద్వారా మార్ట్‌గేజ్ లోన్ పొందవచ్చు.

రుణం ఎలా ఇస్తారు?

రుణాల మంజూరులో బ్యాంకరు విచక్షణ


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in