|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
గులాబీలు
ప్రేమ, వాత్సల్యం, స్నేహం లాంటి సున్నితమైన భావాలతో గులాబీలు కొన్ని వేల సంవత్సరాలుగా ముడిపడి ఉన్నాయి. అలోచనలపరంగా గులాబీలు సౌందర్య దేవతతోనూ, ప్రేమ దేవతతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవి. ఆ తరువాత ఈరాస్ అనే ప్రేమ దేవతతో చేర్చబడి గులాబీల పేరు అల్లుకపోయింది.
గులాబీ పేరులను సమాధులపై పరచడానికీ ఉత్సవ సమయాలలో అలంకరణకు రోమన్లు ఉపయోగించేవారు. యుద్ధ భూమి నుండీ విజయాన్ని సాధించి వెనుతిరిగి వస్తున్న సేనానుల రధాలను అలంకరించేందుకు కూడా గులాబీలను వారు వాడేవారు.
క్రెస్తవ మత ప్రచారం విస్తృతంగా జరగడంతో గులాబీ ' వర్జిన్ మేరీ ' పువ్వుగా మారింది. ప్రార్థనా సమయంలో కాథలిక్కులు వాడే రోసరి పూసలమాలకు ఆ పేరు వర్జిన్ మేరీ సెయింట్ డోమినిక్కు ఇవ్వబడిన మాల కారణంగా వచ్చింది.
చాలా శతాబ్దాలుగా గులాబీలను మందుల తయారీకూ, అత్తరుల తయారీకూ వాడడం జరిగింది. 17వ శతాబ్దంలో గులాబీల నుండి సుగంధ తైలాన్ని తయారుచెయ్యడంలో మనిషి విజయాన్ని సాధించాడు. ఒక పౌండు అత్తరు(సుగంధ త్తెలం) తయారీకు సుమారు 10,000 పౌండ్ల గులాబీ రేకులు కావలసి వస్తాయి.
ప్రాచీన కాలపు రోమన్ ( ప్రస్తుతం ఇటలీ) మహిళలు గులాబీ రేకులు తమ చర్మాన్ని యవ్వనత్వంతో నింపగలవని నమ్మేవారు. గులబీల సువాసనను ఆలివ్ తైలానికి చేర్చి పన్నీరు ( రోస్ వాటర్ )ను వారు తయారుచేసేవారు.
ఈ రోజు మనకు పన్నీరు అపారంగా దొరుకుతోంది. అప్పుడప్పుడు కంటిని శుభ్రపరుచుకునేందుకు కూడ దీనిని వాడుతుంటారు.
గులాబీలలో ఆకర్షణీయమైన విషయం బహుశా దాని అందం, రంగు, సువాసన అయి ఉంటుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in