|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పిల్లల్లో ఊబకాయం
ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయ సమస్య బాగా కనిపిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శీతలపానీయాలు బాగా తీసుకవడం వంటివి లావెక్కడానికి ప్రధాన కారణాలు. భారీ శరీరం వల్ల పిల్లలు వారి వయసుకు మించి కనిపిస్తారు. ఆరోగ్యానికి కూడా ఊబకాయం మంచిది కాదు. పిల్లల్లోని ఈ భారీకాయ సమస్యని ఒక్కసారి తగ్గించడం సాధ్యమయ్యే విషయం కాదు. కింద పేర్కొన్న అంశాలను పరిగణనలో పెట్టుకుని, ఇచ్చిన వ్యాయామాలను క్రమం తప్పకుండా పిల్లల చేత చేయించాలి.
పిల్లలు తమ ఫాస్ట్‌ఫుడ్ జీవనశైలిని మార్చుకునేలా ప్రోత్సహించాలి. శారీరకంగా ఉస్తాహంగా ఉండేట్టు వారిని తీర్చిదిద్దాలి. ఆరోగ్యకరమైన అహారాన్ని వాళ్లకి అలవాటు చేయాలి.
టీవి ముందర గంటల తరబడి కూర్చోనివ్వద్దు. ఈ అలవాటు వల్లే పిల్లల్లో ఊబకాయ సమస్య ఎక్కువవుతోంది.
టివిలోని వ్యాపార ప్రకటనలు రకరకాల తిళ్లవైపు పిల్లల్ని ఆకర్షిస్తున్నాయి. వాటన్నింటినీ అడిగారని కొనిపెట్టొద్దు. ఆటల పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచాలి.
పిల్లల్లో టీవి చూసే అలవాటును తగ్గించడానికి అవసరమైతే తల్లిదండ్రులు కూడా టివిని చూడకుండా ఆపేయాలి.
కంప్యూటర్ గేమ్‌స్ ఆడుతూ కంప్యూటర్ స్క్రీన్ ముందర నుంచి పిల్లల ఒకపట్టాన కదలడం లేదు. ఎక్కువసేపు కంప్యూటర్ గేమ్‌స్‌కి అనుమతించొద్దు. అవసరమైతే కఠినంగా ఉండండి.
బడిలో, కమ్యూనిటీ ఆటల్లో పాల్గొనమని పిల్లల్ని ప్రోత్సహిస్తుండాలి. పిల్లలకు కొత్త కొత్త విషయాలు చెపుతుంటే రకరకాల ఆసక్తులు పెరుగుతాయి.
సూచనలు:
పిల్లలతో ఎక్కువసేపు గడిపేలా టైంని సర్దుబాటు చేసుకోవాలి.
పిల్లలతో వారితో ఆటలు ఆడడం. సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి నేర్పాలి. ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పిల్లలకి కూడా చిన్న చిన్న పనులు చెప్పి చేయిస్తుండాలి.
ఇంట్లో లావున్నపిల్లాడికి తక్కువ పెట్టడం, సన్నగా ఉండే పిల్లవాడికి ఎక్కువ పెట్టడం వంటి తేడాపాడాలు చూపకుండా అందరికీ ఒకేరకంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలి.
లావు తక్కువగా ఉండడం వల్ల, మంచి ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను పిల్లలకు అర్ధమయ్యేలా తరచూ చెపుతుండాలి. ఎప్పటికైనా ఈ మాటలు వారి బుర్రలో పడతాయి.
ఇది తిను. ఇది అస్సలు తినొద్దు అంటూ ఒక్క సారే పిల్లలపై ఒత్తిడి తేకుండా మెల్లగా పిల్లల్లోని అనారోగ్యపు అలవాట్లను పోగొట్టాలి. బెదిరించొద్దు. అలా చేస్తే మరింత మొండికెత్తుతారు. మెల్లగా చెప్పండి.
చాతీ వ్యాయామాలు
స్టెమిలిటీబాల్‌పై వన్ ఆర్మ్ బెంచ్ వర్కవుట్:
స్టెబిలిటీబాల్ మీద వెల్లకిలా పడుకోవాలి. బంతిపై మెడను స్ట్రెట్ పొజిషన్‌లో ఆనిచ్చి పెట్టాలి. నడుము కిందభాగం కొద్దిగా పైకి లేపి దానికి తగ్గట్టు శరీరాన్ని సమస్థితిలో వంచాలి. రెండు చేతులతో డంబెల్స్ పట్టుకోవాలి. ఒక చేయిని పైకి లేపి మెల్లగా దాని మోచేతిని చాతికి దగ్గరగా తీసుకుని వచ్చి డంబెల్‌తో ప్రెస్స్ చేయాలి. అలాగే రెండవ చేతితో కూడా చేయాలి.
పుషప్స్: స్టెమిలిటీ బాల్ మీద పిట్టను ఆనించి బోర్లా పడుకోవాలి. నేలపై అరచేతులు ఆనించాలి. మోచేతులను వంచుతూ శరీరాన్ని మెల్లగా కిందకిదించూతూ పుషప్స్ చేయాలి. ఇలా 10-15మార్లు రెండు లేదా మూడు సెట్లు చేయాలి.
మూలం: ఈనాడు
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in