telugudanam.co.in

      telugudanam.co.in

   

విజయ సాధనకు సప్త శాసనాలు

విజయానికి సూత్రాలు ఎవరూ విక్రయించలేరు.జీవితంలో విజయ శిఖరాగ్రం చేరుకున్న వ్యక్తుల జీవితాలనుంచి నేర్చుకున్న పాఠాలనుంచి కొన్ని సూచనలను మనం తీసుకోవాలని వివేకం ప్రభోధిస్తున్నది.అసంఖ్యాకమైన విజయవంతమైన జీవితాలను గురించి తీవ్రంగానూ మరియు చిత్తశుద్దితోనూ అధ్యయనం చేసి,శాస్త్రీయ దృష్టితో పరిశీలించినప్పుడు,కొన్ని ప్రాధమిక అంశాలు వెలుగులోకి వచ్చాయి.వీటిని "విజయానికి శాసనాలు" అని విశ్వాసనీయంగా అంగీకరించవచ్చు.ప్రస్తుతం ఏడు ప్రధాన విజయ శాసనాలను గురించి తెలుసుకుందాం.


సరైన గమ్యస్థానం నిర్ణయించుకోవాలి

సరైన గమ్యస్థానం అభ్యుదయేచ్చను ఉదయింపజేస్తుంది. అత్యధికులైన విజేతలకు సరైన గమ్యస్థానాలు ఉన్నాయి. చాలా మంది ఏ గమ్యం గురించి ఆలోచించరు,ఎక్కడికీ చేరుకోలేరు. జీవితంలో నీకొక లక్ష్యం,ప్రయోజనం లేకపోయినట్లయితే నీవు పరిస్థితులకు బలి పశువుగా మారిపోతావు.పరిస్థితులకు ఆధిపత్యం వహించి,అదుపులో పెట్టేందుకు ప్రయత్నించు.ఒక నిర్దిష్ట గమ్యస్థానం కలిగి ఉండు. ఆ గమ్యానికి నిన్ను చేర్చేటట్లు పథక రచన చేసుకో.జీవితానికి ఒక ప్రయోజనం ఉన్నట్లయితే అది క్రియాశీల ఆశను ఉత్తేజ పరచేదిగా ఉండాలి.


విద్య లేక సన్నాహం

ప్రయోజనాన్ని సాధించేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకో. మూగ జంతువుల మాదిరి మానవాళి సహజ వుద్ధి పుట్టలేదు. ఈ సహజ బుద్ధి వాటికిగల అనుకూల్య స్థితి. మానవ ప్రాణులు అధ్యయనం చేసేందుకు, విద్యాభ్యాస శిక్షణ పొంది తాము చేయదలచిన పని నెరవేర్చేందుకు సంసిద్ధులు కావాలి. విజయం వరించిన పురుషులందరూ తమ ప్రత్యేక వృత్తిలో స్వయంగా విద్యాభ్యాసం పొందినవారే. విద్యాభ్యాసమంటే కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకునేదే కాదనీ, వ్యక్తిత్వ అభివృద్ధి, నాయకత్వం, అనుభవం, పరిచయాలు, అనుబంధాల ద్వారా జ్ఞాన సముపార్జన మరియు పరిశీలన కూడా కలిసి ఉండాలని వారు గుర్తించారు.


మంచి ఆరోగ్యం

మనం శారీరక జీవులం. మనం భుజించేదే మనిషి రూపం ధరిస్తుంది. లోపమైన ఆహారం వల్లనే 95 శాతం అస్వస్థలు, వ్యాధులు వస్తాయి. శిశువులు పెరిగితే పెద్ద వారవుతారు. అనేక మంది విచక్షణారహితంగా భుజిస్తారు. నీవు తినదగినదేమిటో, తినదగనిదేమిటో గ్రహించుకోవాలి. ఆరోగ్య శాసనాలలోని ఇతర శాసనాలు ఇవి : కంటి నిండా నిద్ర, వ్యాయామం, పుష్కలమైన తాజా గాలి, పరిశుభ్రత మరియు సక్రమమైన తొలగింపు, సరైన ఆలోచన, పరిశుద్ధ జీవితం, అస్వస్థత మరియు వ్యాధి-శరీరం మరియు మనస్సు ప్రకృతి ధర్మాలను పాటించనప్పుడే వస్తాయి. ఇవి ఆరోగ్యానికి చెందిన శారీరక చట్టాలు. శారీరక స్థితిపైన మానసిక స్థితి చెప్పుకోదగిన ప్రాబల్యం కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనే మానసిక వైఖరి వల్లనే అనేక మంది విజయం సాధించిన పురుషులు నిర్మాణాత్మకంగా ఆలోచిస్తారు.


చొరవ

విజయం - ఒక సిద్ధించిన పని. అది నెరవేర్చినది. చురుకుదనం లేని వ్యక్తి పని పూర్తి చేయలేడు. ఒక విజయవంతమైన వ్యక్తి తను చొరవగా ఉండటమే కాక తన క్రింద పని చేసేవారిలో కూడా చొరవను కలిగిస్తాడు. లేని పక్షంలో వీరు ఆలస్యం చేసి, విడిచిపెట్టి, అలాగే స్తవ్దంగా నిల్చిపోతాడు. శక్తి, చొరవ, నిరంతర ప్రేరణ లేకుండా ఒక వ్యక్తి నిజంగా విజయం సాధించలేడు.


సమయోచిత బుద్ధి

జీవితం తరచుగా ఆపదలను, అడ్డంకులను, అనుకోని సమస్యలను ఎదుర్కొంటుంది. ఏదో ఆకస్మిక చిక్కు తలెత్తి నిన్ను పూర్తిగా నిలిపివేస్తుంది. ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు మనకు సమయోచిత బుద్ధి అవసరమౌతుంది. ఆకస్మిక అత్యావశ్యక పరిస్థితులు తలెత్తినపుడు నీకు స్వచ్చమైన మేధ, ప్రశాంతమైన నరాల బలం, త్వరితగతిలో ఆలోచన, లోతైన వివేకం అత్యావశ్యాలు. అన్ని యదార్ధ విషయలను గ్రహించుకుని తెలివిగల నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా నీకు ప్రశాంతమైన మెదడు కావాలి. ఆందోళన స్థితిలో కార్యనిర్వహణకు దుమికేందుకు సిద్ధమైనా నీవు ఉద్రేక పడకుండా ఉండటం అలవర్చుకోవాలి. సరైన నిర్ణయం తీసుకుని, దాన్ని అమలుచేయగలగాలి.


పట్టుదల

మరికొంత విడువకుండా ఉండటంతో దానిపై మరికాస్త విశ్వాసం కలిగి ఉండటంతో మరియు పట్టుదల కలిగి ఉండటంతో స్పష్టమైన అపజయం కూడా ఉజ్వలమైన విజయంగా మారిపోయే సమయంలో జనులు వదిలివేస్తారు. ఈ ఆరు శాసనాలను అనుసరించిన వారు విజయం సాధించారు. వారి గమ్యాన్ని చేరుకున్నారు, డబ్బు గడించారు. హోదా పొందారు. వారు భౌతిక సుఖాలను అనుభవించారు. అయినా వారి జీవితాలు శూన్యమైనవే-వారు ఎన్నటికీ సంతృప్తి చెందలేరు. వారికి శాశ్వతమైన, నిరంతర సౌఖయ్మ్ లభించదు. వారు మరణించినపుడు తమ ఆర్జితాలను వెంట తీసుకువెళ్ళలేరు. వారితోబాటు వారి కీర్తి కూడా అస్తమిస్తుంది. వారికి లేనిదల్లా - విజయ శాసనం అనుసరించటంలో కొరత జరగటమే.


ఏడవ విజయ శాసనం

అతి ప్రాధాన్యంలో మొదటిది. ఇది చివరిదిగా సూచించవడటానికి కారణం - ఇది పాఠకుని మనస్సు మీద గాఢ ముద్ర వేసేందుకే. ఇది అన్ని విధాల ప్రధానమైనది. విజయానికి సప్తమ శాసనం. ఏది ఏమైనప్పటికీ భగవంతునితో సంబంధం కలిగి, మార్గదర్శకత్వం పొందటమే.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: