|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సంకల్ప శక్తి
ఒట్టు పెట్టటంలోనూ, క్షణమైనా గడవకముందే ఆ ఒట్టును తీసి గట్టుమీద పెట్టడం లోనూ మనం గొప్ప ప్రావిణ్యాన్ని సాధిచాం!! ఒట్టు పెట్టటం సులభమే కానీ దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. భీష్ముడికి ఉన్నటువంటి సంకల్పశక్తి మనకు కావాలి. ఆయని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిఙ్ఞ చేసి, దానిని శ్రద్దతో ఆచరించి చూపాడు. బలహీనమైన మనస్సు ఉండేవాల్లు ఏదోవక సాకు చెప్పడానికి చూస్తారు. మనస్సు చంచలమైనది, స్వాభావికంగా అశాంతిగా ఉంటుంది. ఎప్పుడూ ఊగిసలాడుతూ క్షణానికి ఒక ఆలోచన చేస్తుంది. ఎవరైతే ధ్రడమైన సంకల్పాన్ని కలిగి ఉంటారో, గొప్ప పనుల్ని సాధించాలన్న ధ్రుడ నిశ్చయం కలిగి ఉంటారో వాళ్ళు తమ మనస్సులు చెప్పేది వినరు. వాళ్ళు తమ మనస్సులకే యజమానులు. జీవితంలో ఉన్నత విష్యాలను సాధించడంకోసం వాళ్ళు తాము చెప్పినట్లు తమ మనస్సులచేత పని చేయించుకొంటారు.
మహారాజులైన విశ్వామిత్రుడు గర్విష్టి, బ్రహ్మర్షి అయిన వశిష్టుణ్ణి రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతని ప్రయత్నాలు ఫలించక భంగపద్దాడు. వశిష్టుడి దగ్గర ఆధ్యాత్మక శక్తి ఉన్నదని గ్రహించి తానుకూడా తపస్సు చేసి బ్రహ్మర్షికావాలని నిశ్చయించుకొన్నాడు. కానీ మేనక అతనిని ఆకర్షించినప్పుడు సుఖాలవలలో చిక్కుకుపోయాడు. బ్రహ్మర్షి కావడనికి కోపం, ద్వేషం, అసూయ, గర్వం ఈర్ష్య, భ్రమ మొదలైన అడంకులన్నీ దాటవలసి వచ్చినది. అయితే ఆయన తన అమోఘమైన సంకల్ప శక్తితోనే విజయం సాధించాడు. ఓటమి పాలయ్యానని ఆయన ఎప్పుడూ తన గుండెనిబ్బరాన్ని కోల్పోలేదు. ఆయన యొక్క దృఢ నిశ్చయం, ధృడ సంకల్పం, ఆయనలోని ఆత్మ విశ్వాశాన్ని మేల్కొలిపి గెలుపు బాటలో నడిపించాయి. "నేను బలహీనుణ్ణి అని నీవు ఎప్పుడూ చెప్పకూడదు. అల్పమైనదిగా కనిపించే ఆ పైపొర క్రింద ఎటువంటి గొప్ప శక్తి యుక్తులు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు? నీలో ఉన్న అపారమైన శక్తిని గురించి నీకు తెలిసినది చాలా తక్కువ. ఎందుకంటే నీ వెనుక శక్తి సముద్రం, ఆనంద సాగరం ఉన్నాయి."_ స్వామీ వివేకానంద
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in